'వృద్ధులకు అవసరమైన సహాయం అందిస్తాం'
పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ వేణు మాట్లాడుతూ.. వృద్ధులకు అవసరమైన వాకర్స్, చతికరలు అందజేస్తామని తెలిపారు. కొడుకు, కూతుళ్లతో ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే దిశగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.