'స్టార్‌లింక్'తో మహారాష్ట్ర ఒప్పందం
ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు స్టార్ లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్‌తో దేవేంద్ర సర్కార్ లెటర్ఆఫ్ ఇంటెంట్‌పై సంతకం చేసింది. దీంతో మస్క్ శాటిలైట్ కమ్యూనికేషన్ వెంచర్‌తో భాగస్వామ్యాన్ని పొందిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.