రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక వాహన తనిఖీలు

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక వాహన తనిఖీలు

కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణాను అడ్డుకోవడం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడమే లక్ష్యంగా పోలీసులు ఈరోజు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, RC, పొల్యూషన్, ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.