బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

SKLM: పోలాకి మండలం గుప్పెడుపేట గ్రామానికి చెందిన కోడ రక్షిత అనారోగ్యంతో బాధ పడుతుంది. వైద్య ఖర్చుల కోసం రూ. 95,090 సీఎంఆర్ఎఫ్ చెక్కును నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన గురువారం సాయంత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో తోడ్పాటుగా నిలుస్తుందని తెలిపారు.