బాల్యవివాహాల నిషేధ చట్టం పై అవగాహన కార్యక్రమం
GDL: జిల్లా న్యాయ సేవల అధికార సంస్థ ఆధ్వర్యంలో, బాల్ వివాహ ముక్త్ భారత్ 100 రోజుల ప్రచార కార్యక్రమంలో భాగంగా గద్వాల రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీనివాసులు పాల్గొని, ప్రజలకు బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలు, బాలల హక్కులు, బాల్య వివాహాల నిషేధ చట్టం పై అవగాహన కల్పించారు.