దివ్యాంగులకు సబ్సిడీతో రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు

దివ్యాంగులకు సబ్సిడీతో రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు

VZM: దివ్యాంగులకు 100 శాతం సబ్సిడీతో ప్రభుత్వం రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలను మంజూరు చేయనుందని జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకుడు ఆశయ్య బుధవారం తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 25లోగా www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వయస్సు 18-45 సంవత్సరాల మధ్య ఉండి కనీసం 70 శాతం దివ్యాంగత కలిగి ఉండాలన్నారు.