US యుద్ధనౌకపై దాడి చేశాం: ఇరాన్
US యుద్ధనౌక ‘లింకన్’పై 4 బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. యుద్ధ విమానాలను తరలించే ఈ నౌక లక్ష్యంగా దాడులు జరిగాయి. US-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ హతమైన నేపథ్యంలో ఈ ప్రతీకార చర్య చోటుచేసుకుంది. ఈ పరిణామంతో పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమైంది. అగ్రరాజ్యం దీనిపై ఎలా స్పందిస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.