ఈ రెండు సినిమాలు పూర్తి భిన్నమైనవి: రాహుల్
'అర్జున్ రెడ్డి'తో 'ది గర్ల్‌ఫ్రెండ్'ను పోలుస్తూ పోస్టులు పెట్టడంపై దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్పందించాడు. వీటికి అసలు పోలిక లేదన్నాడు. 'అర్జున్ రెడ్డి' ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్ అయిన సినిమా అని అన్నాడు. ఈ రెండు మూవీలు చూడడానికి ఒకేలా ఉండొచ్చు కానీ పూర్తి భిన్నమైనవని తెలిపాడు. 'అర్జున్ రెడ్డి' రావడానికి ముందే దీని కథను రెడీ చేసుకున్నానని చెప్పాడు.