ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. 10 మంది మృతి
ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. ఖర్కీవ్‌లో ఐదు అంతస్థుల భవనాన్ని రష్యా క్షిపణి తాకిన ఘటనలో 10 మంది మరణించారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. రష్యా 29 క్షిపణులు, 480 డ్రోన్లు ప్రయోగించిందని చెప్పారు. ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా మాస్కో దాడులు చేసిందని తెలిపారు.