'రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలి'

'రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలి'

MNCL: రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్ కోరారు. అధికారుల ఆదేశాల మేరకు సోమవారం పోన్కల్ గ్రామపంచాయతీలో రోడ్ సేఫ్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు సభ్యులకు, ప్రజలకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అప్పని జలపతి, ఈవో రాహుల్ ఉన్నారు.