'పారిశుద్ధ్య సమస్యలను సమన్వయంతో పరిష్కారించండి'

KRNL: నగరంలో పారిశుద్ధ్య పనులను సంబంధింత అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని నగర కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. మంగళవారం 37వ వార్డు శాంతినగర్ ప్రాంతాన్ని పరిశీలించారు. రహదారులపై వర్షపు నీరు నిలవకుండా ఆక్రమణలు తొలగించి కచ్చ కాలువ నిర్మించాలని ఆదేశించారు. శాశ్వత పరిష్కారానికి రూ.50 లక్షలతో సిసి డ్రైన్ నిర్మాణానికి సత్వరమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.