నీటి భద్రతా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రకాశం: గిద్దలూరు మండలం కంచుపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన “నీటి భద్రత-సాగు నీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. చెరువులను పరిశీలించి పూడికతీత, కాలువల అనుసంధానం ద్వారా నీటి నిల్వలు పెంచాలని అధికారులకు సూచించారు. రైతులతో మాట్లాడి చెరువుల పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.