నియమావళిని ఉల్లంఘన.. పలువురిపై కేసు నమోదు
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పలువురిపై కేసులు నమోదు చేసినట్టు సీపీ సజ్జనార్ తెలిపారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్‌లపై మధురానగర్ PSలోనూ, అదే విధంగా దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌పై బోరబండ PSలో కేసు నమోదైనట్లు వెల్లడించారు.