VIDEO: అక్రమ కట్టడాలను కూల్చివేస్తాం: కమిషనర్

NLR: నగరపాలక సంస్థ పరిధిలోని వెంకటరామపురం, జేమ్స్ గార్డెన్ ప్రాంతాల్లో చేపట్టిన అనధికార నిర్మాణాల తొలగింపు ప్రక్రియను కమిషనర్ వై.వో.నందన్ బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. లేకపోతే అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు.