నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి

వరంగల్: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా. సత్యశారద తెలిపారు. సోమవారం ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ప్రజావాణిలో జిల్లా ప్రజలు తమ సమస్యలు విన్నవించుకునేందుకు అవకాశం ఉందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.