నాంపల్లి కోర్టులో iBOMMA రవి బెయిల్, కస్టడీపై విచారణ
HYD: నాంపల్లి కోర్టులో iBOMMA రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాల్టికి వాయిదా వేసింది. ఇవాళ ఇరు వాదనలు విచారించి తీర్పు ఇవ్వనుంది.