జైపూర్ అటవీ ప్రాంత పరిసరాల్లో పులి సంచారం
MNCL: జైపూర్ అటవీ ప్రాంత పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ సిబ్బంది గుర్తించినట్లు కుందారం శిక్షణ అధికారి భగవంతరావు ప్రకటనలో తెలిపారు. ముదిగుంట, మిట్టపల్లి, వెంకట్రావుపల్లి, నర్వ గ్రామాల అటవీ ప్రాంతంలో పాదముద్రల ఆధారంగా పులి కదలికలను గుర్తించామన్నారు. పెగడపల్లి, గంగిపల్లి, మద్దులపల్లి, నర్సింగాపూర్ తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.