యమునా పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

యమునా పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

కోనసీమ: రావులపాలెం ఆర్టీసీ డిపో నుంచి యమునా పుష్కరాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ మూడో తేదీ నుంచి 14వ తేదీ వరకు సూపర్ లగ్జరీ బస్సులు నడుస్తాయని తెలిపారు. ఈ పర్యటనలో అయోధ్య, కాశీ, మధుర తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చన్నారు. భోజన సౌకర్యంతో కలిపి టికెట్ ధర రూ.14 వేలు అని తెలిపారు.