VIDEO: సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా
SRD: మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ఆదిత్య నగర్ కాలనీవాసులు సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు సాయిలు మాట్లాడుతూ.. పది రోజులుగా మంచినీళ్లు సరిగా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.