కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికపై ఆశావహులు ఎదురుచూపు
WGL: సర్పంచ్ ఎన్నికల ముగిసి మూడు నెలలు గడుస్తున్నా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామాల్లో చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా సర్పంచ్ ఎన్నికలు ముగిసిన ఒక నెల లోపు కో-ఆప్షన్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఆశావహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.