VIDEO: దేశ ముఖచిత్రాన్ని మార్చేదే 'తెలంగాణ రైజింగ్-2047’

HYD: 2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్‌లో తెలంగాణ కీలకంగా ఉండాలనేది తమ సంకల్పమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్-2047’ అని పేర్కొన్నారు. 2035 నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థికవ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థికవ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రం అన్నారు.