జయమంగళి నదిలో కలుస్తున్న రసాయనిక వ్యర్థాలు

జయమంగళి నదిలో కలుస్తున్న రసాయనిక వ్యర్థాలు

సత్యసాయి: పరిగి మండలంలోని కొన్ని ఫ్యాక్టరీల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలను జయమంగళి నదిలో వదులుతున్నారు. దీంతో పంట పొలాలను కలుషితం అవుతున్నాయని రైతులు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యర్థాల కారణంగా భూగర్భ జలాలు కలుషితమై, ప్రజలు, మూగజీవాలు అనారోగ్యాల బారిన పడుతున్నారని వారు తెలిపారు. అధికారులు స్పందించి రసాయన వ్యర్థాలను అరికట్టాలని రైతులు కోరారు.