మానవత్వాన్ని చాటుకున్న వాకర్స్ అసోసియేషన్

BHPL: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక జయశంకర్ పార్క్ వాచ్ మెన్ మల్లేష్ భార్య సరోజ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆసుపత్రికి వెళ్లే ఆర్ధిక పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భముగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మల్లేష్ కు రూ.15000 అందజేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.