పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత

పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత

కామారెడ్డి జిల్లా: మహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లి గ్రామానికి చెందిన కుర్మ రాములు గత కొన్ని రోజుల క్రితం తన మొబైల్ ఫోన్ పొగొట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్లో తన ఫోన్ పోయినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఈఐఆర్ వెబ్ సైట్ సాయంతో ఆ ఫోను స్వాధీనం చేసుకొని మంగళవారం ఫిర్యాదు దారుడుకి ఎస్సై సుధాకర్ అప్పగించారు.