ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి
ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి ఇవాళ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండేపి నియోజకవర్గం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులకు సత్వరమే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.