ఇంధన కొరతతో మూతపడ్డ పెట్రోల్ బంక్‌లు

ఇంధన కొరతతో మూతపడ్డ పెట్రోల్ బంక్‌లు

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని పలు పెట్రోల్ బంక్‌లు బుధవారం తాత్కాలికంగా మూతపడ్డాయి. ఇంధనం కొరత ఏర్పడుతుందని వదంతులతో నిన్నటి నుంచి వాహనదారులు భారీగా తరలిరావడం జరిగిందన్నారు. వాహనదారులు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్‌ను తీసుకు వెళ్ళటంతో బంక్‌లో నిల్వ ఉన్న ఇంధనం తగ్గిపోయినట్టు వివరించారు. పెట్రోల్ లేకపోవడంతో వాహనదారులు తిరిగి వెళ్ళిపోతున్నారు.