బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు
WGL: బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా కార్యదర్శి డాక్టర్ రానా ప్రతాప్ రెడ్డి హాజరై వినయ్ గౌడ్‌కు పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను ఉత్సాహంగా జరిపారు.