'పండ్ల మొక్కల కోసం దరఖాస్తు చేసుకోవాలి'

NLG: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్ల మొక్కలు కావలసిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని నకిరేకల్ ఉద్యానవన అధికారి ప్రవీణ్ శుక్రవారం తెలిపారు. నిమ్మ, బత్తాయి, మామిడి, దానిమ్మ, సీతాఫలం, పామాయిల్ మొక్కల కోసం సంబంధిత గ్రామ కార్యదర్శిని లేదా ఫీల్డ్ అసిస్టెంట్‌ను సంప్రదించాలని సూచించారు. నియోజకవర్గంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.