వీధిలైట్ల విషయంలో జూనియర్ లైన్‌మెన్‌పై దాడి
KRNL: పెద్దకడబూరు మం. హనుమాపురంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్‌మెన్ రసూల్‌పై అదే గ్రామానికి చెందిన రఘు గత రాత్రి దాడి చేశాడు. వీధిలైట్లు వేస్తుండగా, మద్యం మత్తులో ఉన్న రఘు తన ఇంటి వద్ద లైట్ వేయాలని ఘర్షణకు దిగినట్లు ఆయన తెలిపాడు. హామీ ఇచ్చినా వినకుండా రఘు దుర్భాషలాడి, పిడిగుద్దులు గుద్దాడని రసూల్ పేర్కొన్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు చెప్పాడు.