ఈనెల 8 నుంచి పీజీ పరీక్షలు ప్రారంభం

ATP: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 8 నుంచి ప్రారంభం అవుతాయని డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. 13వ తేదీతో ముగుస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా యూజీ రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను ఆయన పర్యవేక్షించారు. కదిరిలోని డిగ్రీ కళాశాలలను తనిఖీ చేశారు.