ఇకపై సింగరేణి ఉపరితల గనుల్లో మహిళా ఆపరేటర్లు

ఇకపై సింగరేణి ఉపరితల గనుల్లో మహిళా ఆపరేటర్లు

BDK: సింగరేణిలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా లేదా బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పని చేయడానికి ఎంపిక కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మైనింగ్ రంగంలో మహిళల సాధికారత, మానవ వనరుల సమర్థ వినియోగంలో భాగంగా సీఎండీ ఎన్.బలరామ్ ఆలోచనల మేరకు శనివారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.