విద్యుత్ సమస్యల నుంచి ఉపశమనం

విద్యుత్ సమస్యల నుంచి ఉపశమనం

SDPT: బెజ్జంకి మండలం గుండారంలోని 7వ వార్డు ప్రజలకు విద్యుత్ సమస్యల నుంచి ఉపశమనం లభించింది. కాలం చెల్లిన స్తంభాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిలో అధికారులు కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. దీంతో లో వోల్టేజ్ సమస్యలు తగ్గి సరైన సరఫరా అందనుంది. సమస్య పరిష్కారానికి సహకరించిన విద్యుత్ అధికారులకు, గ్రామపంచాయతీకి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.