'రైతులను కూలీలుగా మార్చే చట్టాలు రద్దు చేయాలి'
BDK: సుజాతనగర్ మండలంలో రైతు సంఘం, సీఐటీయు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ నిరసన వ్యక్తం చేశారు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు కున్సోత్ ధర్మ మాట్లాడుతూ.. 2020లో నరేంద్ర మోడీ ప్రభుత్వం కంపెనీ వ్యవసాయం పేరుతో నల్ల చట్టాలను తీసుకొచ్చిందని దేశానికి అన్నం పెట్టే రైతన్న భూములను లాక్కొని అదే భూమిలో రైతులను కూలీలుగా మార్చే చట్టాలను రద్దు చేయాలన్నారు.