విజయవాడ: నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయానికి నోటీసులు

కృష్ణా: విజయవాడలో ఎలాంటి అనుమతులు, ప్లాన్ అప్రూవల్ లేకుండా వైసీపీ కార్యాలయం నిర్మిస్తున్నారంటూ నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. విద్యాధరపురం కార్మిక శాఖ స్థలంలో కనీసం ప్లాన్ అప్రూవల్ కూడా లేకుండా నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం పూర్తిగా అక్రమ నిర్మాణమని అధికారులు పేర్కొన్నారు. 7 రోజుల్లోపు సమాధానం ఇవ్వకపోతే కూల్చివేస్తామని హెచ్చరించారు.