కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు

కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు

SKLM: టెక్కలి మేజరు పంచాయతీ పరిధిలోని ఆధిఆంధ్రావీధికి చెందిన కే.తన్విక్ సాయి అనే ఐదేళ్ల బాలుడుపై ఆదివారం సాయంత్రం వీధికుక్కలు దాడిచేసి గాయపరిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వీధికుక్కలు చిన్నారిపై దాడిచేయడంతో గాయపడ్డాడు. బాలుడిని చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.