నా గురించి కిషన్‌రెడ్డికి అవగాహన లేదు: మంత్రి

నా గురించి కిషన్‌రెడ్డికి అవగాహన లేదు: మంత్రి

TG: మంత్రిగా తనకు అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని అజారుద్దీన్ అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానానికి, సీఎం రేవంత్‌కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే.. BJP, BRS నేతలు తనపై చేస్తున్న విమర్శలపై స్పందించారు. 'నాపై వచ్చినవన్నీ ఆరోపణలు మాత్రమే. నా గురించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పూర్తిస్థాయి అవగాహన లేదు. నాపై ఉన్న ఒక్క కేసులోనూ నేరం రుజువు కాలేదు' అని పేర్కొన్నారు.