'రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలి'

KMM: తల్లాడ మండలం కుర్ణవల్లి సొసైటీ పరిధిలో 5,800 ఎకరాల సాగు భూమి ఉండగా కేవలం 580 బస్తాల యూరియా మాత్రమే అందిందని రైతు సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సొసైటీ వద్ద మాట్లాడుతూ.. రైతులకు సరిపడా యూరియాను ప్రభుత్వం వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.