కూతురు ప్రేమ వివాహం: తల్లి ఆత్మహత్య
WGL: రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలోనార్లాపురం జయమ్మ (40) బుధవారం తొర్రూర్ ప్రైవేట్ హాస్పిటల్‌లో మృతి చెందింది. ఇటీవల కుమార్తె ప్రేమవివాహం చేసుకోవడం వల్ల మనోవేదనకు గురైన జయమ్మ గడ్డి మందు తాగింది. కుటుంబసభ్యులు వెంటనే హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందించగా, పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.