పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్ల పంపిణీ

KMM: ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో విధి నిర్వహణలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ పూనుకొల్లు నీరజ సోమవారం పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..వర్షాకాలంలో ప్రజలకు శానిటేషన్ సేవలు అందించే కార్మికులు చాలా ఇబ్బందులు పడుతుండడంతో రెయిన్ కోట్లు అందజేసినట్లు తెలిపారు.