భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

KRNL: దేవనకొండ మండలంలోని జిల్లేడబుడకల గ్రామంలో సంతానలేమి కారణంగా భర్త వడ్ల బాలకృష్ణ వేధింపులకు గురైన వడ్డే పద్మ అనే వివాహిత రసాయన ద్రావణం సేవించి ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందినట్లు సీఐ వంశీనాథ్ శనివారం తెలిపారు. సోదరుడు గురప్పచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.