మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీలో చేరిక
SRPT: నూతనకల్ మండలం మిర్యాల గ్రామ మాజీ ఎంపీటీసీ అనంతుల మంగమ్మ శుక్రవారం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతోపాటు మరో 50 మంది పైగా అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరిక మిరియాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని, సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ అన్నారు.