'విద్యార్థుల ఇబ్బందులు.. రోడ్డు మరమ్మతులు చేపట్టాలి'

RR: షాద్ నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండలం పరిధిలోని చెన్నారెడ్డిగూడ- చేగిరెడ్డి ఘనపూర్ రహదారి గుంతల మయంగా మారిందని AISF జిల్లా సహాయ కార్యదర్శి ఆకాశనాయక్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. గుంతల కారణంగా బస్సులు నిలిపివేయబడ్డాయని స్పష్టం చేశారు. గుంతల కారణంగా విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లెందుకు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలన్నారు.