VIDEO: వన్యప్రాణుల సంరక్షణ మనందరి బాధ్యత

ADB: అటవీ, వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత అని ఉడుంపూర్,కల్లెడ రేంజ్ డీఆర్‌వో డీ. ప్రకాశ్ అన్నారు. కడెం మండలంలోని దోస్తునగర్ గ్రామంలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, భద్రత పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో విద్యుత్ ఘాతం వలన కలిగే ప్రమాదలపై వివరించారు. పులుల కదలికలు ఉన్న నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో అడవుల్లోకి వెళ్లవద్దని సూచించారు.