VIDEO: 'యువకులను కాపాడిన మెరైన్ పోలీసులు'

SKLM: సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు యువకులను మెరైన్ పోలీసులు కాపాడిన ఘటన వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర్ బీచ్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. మెరైన్ పోలీసులు బీచ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఇద్దరు యువకులు సముద్రంలో మునిగిపోతుండడం గమనించి వారిని కాపాడారు. వారు ఒరిస్సాకు చెందినవారీగా గుర్తించారు.