జాప్యానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

NZB: రైస్ మిల్లుల వద్ద ధాన్యంనిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు బాల్కొండ, వెంచిర్యాల్లో మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.