రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి తీవ్ర గాయాలు
మదనపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వరుణ్ (25) అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తంబళ్లపల్లె (మం) సాకలపల్లికి చెందిన వరుణ్, బోయకొండ నుంచి తిరిగి వస్తుండగా కురబలకోట మండలం దాదాంవారిపల్లి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికులు అతన్ని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు.