ఒకేరోజు రెండు పరీక్షలు.. విద్యార్థుల ఆందోళన

TG: రాష్ట్రంలో ఈ నెల 25న ఒకే రోజు డీఈఈసెట్(DEECET), ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు ముఖ్యమైన పరీక్షలు ఒకే రోజు జరగనుండటం వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రెండింటిలో ఏదైనా ఒక పరీక్షను వాయిదా వేయాలని విద్యార్థులు అధికారులను కోరుతున్నారు.