అక్రమ మట్టి రవాణాపై పోలీసుల ఉక్కు పాదం

అక్రమ మట్టి రవాణాపై పోలీసుల ఉక్కు పాదం

BDK: బూర్గంపాడు మండల పరిధిలోని సీతారామ ప్రాజెక్టు కాలువ ప్రాంతంలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ మట్టి రవాణాపై పోలీసులు శనివారం ఉక్కుపాదం మోపారు. కాలువ గట్టు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మట్టిని తరలిస్తున్న 2 లారీలు, 1 జేసీబీని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.