కృత్రిమ కాళ్లు అందజేసిన జిల్లా కలెక్టర్

కృత్రిమ కాళ్లు అందజేసిన జిల్లా కలెక్టర్

అనంతపురం: కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ముగ్గురు విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లు అందజేసేందుకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.