కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

CTR: కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయలైన ఘటన రొంపిచర్ల క్రాస్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఇటుకల బట్టిలో కూలిగా పనిచేస్తున్న విశ్వనాథ నిన్న రాత్రి రోడ్డు దాటుతుండగా తిరుపతి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన ఆయన్ను 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.